రాముడు చూపించిన మార్గంలో నడిచేందుకు ప్రయత్నిస్తా: పాక్ క్రికెటర్

అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరగడంపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సంతోషం వ్యక్తం చేశాడు. భూమిపూజ జరిగిన ఆగస్ట్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆనందకరమైన రోజంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అయోధ్య అనేది మతపరమైన గొప్ప ప్రదేశమని తెలిపాడు. తనకు అవకాశం లభిస్తే తప్పకుండా అయోధ్యకు వస్తానని చెప్పాడు. తాను ఒక హిందువునని… రాముడు చూపించిన మార్గంలో నడిచేందుకు తాను ఎప్పుడూ ప్రయత్నిస్తానని ట్వీట్ చేశాడు.

డానిష్ కనేరియా చేసిన ట్వీట్ పై పలువురు నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు జాగ్రత్తలు కూడా చెపుతున్నారు. ఇలాంటి ట్వీట్ చేసిన తర్వాత అలర్ట్ గా ఉండాలని…పాక్ లో ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందంటున్నారు.

Latest Updates