ఆటోను ఢీకొట్టిన లారీ : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ధరూర్ నుంచి వికారాబాద్ వస్తుండగా  ఆటోను..వేగంగా ఢీకొట్టింది లారీ.  ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా చెబుతున్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. మృతులు కమలమ్మ(44), శారద(32), అర్చన(11)గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారుగు గుర్తించారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates