ఐదు కార్లను ఢీకొట్టి బోల్తా పడిన లారీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్  రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రోడ్డు పక్కన 5 కార్లును ఢీ కొట్టింది.తర్వాత ఓ పాన్ డబ్బాలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. . ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా, మరో రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. ప్రమాదం జరగగానే లారీని విడిచిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు.

Latest Updates