లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

వనపర్తి: ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టిన సంఘటన ఇవాళ తెల్లవారుజామున వనపర్తి  జిల్లాలో జరిగింది. కొత్తకోట మండలం విలియంకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. VRL ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని వనపర్తి జిల్లా ప్రభుత్వ హస్పిటల్ కి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Latest Updates