శానిటైజర్లతో వెళ్తున్న లారీకి మంటలు

రంగారెడ్డి జిల్లా: అగ్ని ప్ర‌మాదంలో లారీ ద‌గ్ద‌మైన సంఘ‌ట‌న బుధ‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ శివారులోని బొల్లారంలో జ‌రిగింది. మియాపూర్-బొల్లారం రోడ్ లో వెళ్తుండగా ప్ర‌మాద‌వ‌శాత్తు లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో బొల్లారం చౌరస్తాలో శానిటైజర్ల డబ్బాలతో సహా లారీ పూర్తిగా దగ్ధమైంది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని.. శానిటైజ‌ర్లు, లారీ ద‌గ్ద‌మ‌య్యాయి తెలిపారు పోలీసులు. అగ్ని ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Latest Updates