విద్యుత్ తీగలను తాకిన కంటైనర్.. డ్రైవర్ మృతి

కంటైనర్ లారీకి విద్యుత్ షాక్ తగిలి అందులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్ పహాడ్ దగ్గర జరిగింది. కంటైనర్ తో వెళుతున్న ఓ లారీకి పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షాక్ కి గురై అక్కడే మరణించాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates