ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ దగ్ధం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ దగ్ధం అయింది. మేడ్చల్ నుండి శివరాంపల్లికి వెళ్తుండగా రన్నింగ్ లోనే లారీలో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ లారీ దిగిపోవడంతో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. లారీలో మంటలు రావడానికి షార్ట్ సర్క్యూటే కారణమని లారీ క్లీనర్ అంటున్నాడు.

Latest Updates