లారీ ఢీకొని గర్భిణీ స్పాట్ లోనే మృతి

వైజాగ్ : లారీ ఢీకొని గ‌ర్భిణీ స్పాట్ లోనే మృతిచెందిన సంఘ‌ట‌న బుధ‌వారం వైజాగ్ లో జ‌రిగింది. కె. కోటపాడుకి చెందిన బోర్ల బుజ్జికి పది నెలల క్రితం వివాహమైంది. భార్య మూడు నెలల‌ గర్భవతి కావటంతో వైద్య పరీక్షల కోసం బుధ‌వారం ఉద‌యం వైజాగ్ లోని ఓ హాస్పిట‌ల్ కి వచ్చారు. చెక‌ప్ త‌ర్వాత‌ తిరిగి 12 గంటల సమయంలో జాతీయ రహదారిపై నుండి ఎన్ఏడీ వైపుగా వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ మ‌హిళ‌ను బలంగా ఢీ కొట్టింది.

దీంతో లారీ వెనుక చక్రాలు ఆమె తలపైకి దూసుకు పోవడంతో.. అక్క‌డిక‌క్క‌డే గ‌ర్భిణీ చ‌నిపోయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న‌స్థ‌లికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్ట‌మ్ కోసం హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. అనంత‌రం లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Latest Updates