బురదలో దిగబడ్డ లారీ.. బయటపడ్డ ‘అక్రమ రేషన్’

వైరా,వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంతబజారు లో సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎక్కిరాల బాలకృష్ణ అనే వ్యాపారి మరో ముగ్గురితో కలిసి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారు. అయితే సంతబజారులో నిల్వ ఉంచిన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో కాకినాడకు తరలించాలని ప్లాన్ వేశాడు. అధిక లోడు ఉండటంతో లారీ దిగబడిపోయింది. స్థానికులకు ఎందుకో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అవి పేదలకు సంబంధించిన రేషన్ బియ్యం అని తేల్చి లారీ స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణతో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

 

Latest Updates