విశాఖలో బీభత్సం సృష్టించిన లారీ

బ్రేక్ ఫెయిలై వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ

ఇద్దరి మృతి.. మరికొందరికి గాయాలు

విశాఖపట్టణం: నిత్యం రద్దీగా ఉండే హనుమంతవాక జంక్షన్లో బ్రేక్ ఫెయిలైన లారీ ఆగి ఉన్న వాహానాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. పట్టపగలు జరిగిన ఘటన కలకలం రేపింది. ఆదివారం కాస్త రద్దీ తక్కువగా ఉండడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. మధురవాడ వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీ కొడుతూ దూసుకెళ్లింది. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు లారీ ఢీకొట్టడంతో ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరి కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Latest Updates