స్లీపింగ్ బ్యూటీ లవ్ ప్రపోజల్ కు ప్రియురాలు ఫిదా..వైరల్ అవుతున్నలవ్ ప్రపోజల్

ప్రేమలో పడటం ఓ మధురమైన అనుభూతి. మనసుతో ఊసులాడుకునే ఆ తీయని అనుభవాన్ని కోరుకోని యువతీయువకలు ఉంటారా? ప్రియురాలికి ప్రియుడు ప్రపోజ్ చేయాలని, ప్రియురాలు ప్రియుడికి ప్రప్రోజ్ చేయాలని తెగ ఊగిసలాడుతుంటారు. అందుకే  ప్రపోజ్ చేయడానికి ఏ ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ప్రేమను ఎక్కడ, ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించిన ఓ ప్రేమికుడు ఏం చేశాడో తెలుసా.

అమెరికా లాస్ ఎంజెల్స్ కు చెందిన ఫిల్మ్ మేకర్, ఎడిటర్ అయిన లీ లోచ్లర్, కార్డియాలజిస్ట్ అయిన స్తుతిని ప్రేమిస్తున్నాడు. వాళ్లిద్దరు స్కూల్ మెట్స్ కూడా. అయితే స్తుతిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్న లీలోచ్లర్ ఎలాగైన తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకున్నాడు. అందరిలా కాకుండా కొంచెం వినూత్నంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఓ తియ్యటి మధుర జ్ఞాపకాన్ని అందివ్వాలని అనుకున్నాడు.

డిస్నీ నిర్మాణంలో తెరకెక్కిన  స్లీపింగ్ బ్యూటీ సినిమా అంటే స్తుతికి చాలా ఇష్టం. ఆ సినిమాలోని కొన్ని క్యారక్టర్ల ఆధారంగా ఓ యానిమేటడ్ వీడియోను స్నేహితుల సాయంతో డిజైన్ చేశాడు. యానిమేటెడ్ వీడియోలో ప్రియురాలు చంద్రుడిపై పాన్పు..ఆ పాన్పుపై స్తుతి పడుకున్నట్లు 6 నెలల పాటు స్వయంగా ఓ వీడియోను తానే డిజైన్ చేశాడు. డిజైన్ చేసిన వీడియోను ఓ థియేటర్ లో ప్లే అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు.

ఓ రోజు స్లీపింగ్ బ్యూటీ సినిమాకి వెళ్దామా అంటూ స్తుతిని, లీలోచ్లర్  ముందుగా ప్లాన్ చేసుకున్న థియేటర్ కు తీసుకెళ్లాడు. సినిమా స్టార్ట్ అయ్యింది. స్క్రీన్ మీద స్తుతి చంద్రుడిపై నిద్రపోతున్నట్లు..అదే సమయంలో నిద్రపోతున్న స్తుతికి లీలోచ్లర్  తన ప్రేమప్రోజ్ చేసినట్లు ప్రసారం అవుతుంది. స్లిపింగ్ బ్యూటీ సినిమాకి వచ్చిన స్తుతి థియేటర్ స్క్రీన్ పై ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదు.

అయితే చంద్రుడిపై నిద్రపోతున్న తన ఆకారంతో ఉన్న క్యారక్టర్ అని గుర్తించింది. లవ్ ప్రపోజ్ చేసేందుకు వచ్చింది లీలోచ్లర్ అని గుర్తించి తియ్యటి షాక్ కు గురైంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే లీలోచ్లర్ ఓ స్తుతి ఎదురుగా వచ్చి జేబులోనుంచి ఓ ఉంగరాన్ని తీసి మొకాళ్లపై నిల్చొని తన ప్రేమను వ్యక్తం చేశాడు.

ఆ షాక్ నుంచి తేరుకోని స్తుతి అలాగే ఉండిపోయింది. లీలోచ్లర్ ప్రేమను వ్యక్తం చేస్తుండగా థియేటర్ తన వెనుకవైపు నుంచి పెద్దగా కేకలు, విజిల్స్ వినిపిస్తున్నాయి. ఏంటా అని వెనక్కి చూసిన స్తుతి మరోసారి షాక్ కు గురైంది. ఎందుకంటే ఆమె వెనుక ఉన్నది సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు కాదని, తన తల్లిదండ్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, లీలోచ్లర్ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ అని గుర్తించింది.అలాగే మొకాళ్లపై ఉన్న లీలోచ్లర్ ప్రేమను అంగీకరీంచింది. ఇలా థియేటర్ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ ను ప్రియుడు లీలోచ్లర్  సీక్రెట్ గా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Latest Updates