
రూ. 3.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
1,145 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
50 వేల కిందకు ఇండెక్స్
2 నెలల్లో అతిపెద్ద సింగిల్డే లాస్
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లు వరసగా ఐదో సెషన్లోనూ నష్టపోయాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో ఇండెక్స్‌లు సోమవారం భారీగా పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1,300 పాయింట్లు పతనమై కీలకమైన 50 వేల మార్క్ కిందకు పడింది. చివరికి 1,145 పాయింట్ల(2.25%) లాస్‌తో 49,744 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 340 పాయింట్లు పడిన నిఫ్టీ, చివరికి 306 పాయింట్ల(2.04%) నష్టంతో 14,676 పాయింట్ల వద్ద ముగిసింది.
గత రెండు నెలల్లో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లకు ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్. ఇండెక్స్‌లు కన్సాలిడేట్ అవుతున్నాయని, పడిన షేర్లన్ని తిరిగి పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎఫ్‌పీఐల ఇన్‌ఫ్లోస్ కొనసాగుతాయని అంచనావేస్తున్నారు. ‘యూఎస్ 10 ఇయర్ బాండ్ ఈల్డ్ ఏడాది గరిష్టమైన 1.36 శాతానికి పెరిగింది. దీంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనే ఆందోళనను మార్కెట్లు వ్యక్త పరిచాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. బైడెన్ ప్రభుత్వం తెస్తున్న మానిటరీ పాలసీ, 1.9 బిలియన్ డాలర్ల స్టిమ్యులస్ ప్రపోజల్ వలన ఇన్ఫ్లేషన్ పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడం కూడా మార్కెట్లు పడడానికి కారణమయ్యిందని పేర్కొన్నారు. దీని ప్రభావం ఎఫ్‌పీఐల ఇన్‌ఫ్లోస్‌పై పడుతుందని చెప్పారు.
పడిన షేర్లు మళ్లీ పెరుగుతాయి..
గ్లోబల్ మార్కెట్లు నెగటివ్‌లో ట్రేడవుతుండడంతో పాటు, డొమెస్టిక్‌గా కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్కెట్లు నష్టపోయాయని ఎనలిస్టులు చెబుతున్నారు. మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఈ వారం ముగియనుండడంతో వొలటైలిటీ ఎక్కువగా ఉందని చెప్పారు. యూఎస్ బాండ్ ఈల్డ్ పెరగడం, ఇన్ఫ్లేషన్ భయాలు ఎఫ్‌పీఐ ఇన్‌ఫ్లోస్ పై ప్రభావం చూపాయని అన్నారు. ప్రస్తుత మార్కెట్లో పడిన షేర్లలో మళ్లీ కొనుగోళ్లు పెరుగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. దేశ ఎకనామిక్ ఫండ్‌మెంటల్స్ మెరుగుపడడంతో ఇండస్ట్రియల్, సైక్లికల్ షేర్లకు డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
14,500 వరకు నిఫ్టీ?
సెన్సెక్స్‌లో డా.రెడ్డీస్, ఎం అండ్ ఎం, టెక్ మహింద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ 14,800 స్థాయికి దిగువన ఉన్నంత వరకు నెగిటివ్‌లోనే కొనసాగుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ చందన్ తాపారియా అన్నారు. నిఫ్టీకి 14,500, 14,400 స్థాయిలో సపోర్ట్ ఉందని చెప్పారు. అప్సైడ్న 15,000, 15,150 స్థాయిలో రెసిస్టెన్స్ ఉందని పేర్కొన్నారు.
మార్కెట్లో ముఖ్యంశాలు..
ఎన్ఎస్ఈలో 1,388 షేర్లు నష్టపోగా, 561 షేర్లు లాభాల్లో ముగియగలిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్(1.6 శాతం అప్) మినహాయించి మిగిలిన అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు నెగిటివ్‌లో ముగిశాయి. ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఎనర్జీ, ఇన్ఫ్రా ఇండెక్స్‌లు 2 శాతం చొప్పున పడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 580 పాయింట్లు(1.6%) నష్టపోయి 35,257 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ ఇండెక్స్ గరిష్ట స్థాయి 37,708 నుంచి 2,500 పాయింట్లు పతనమయ్యింది.