చేతులు కాదు సంకల్పం గొప్పది..మోచేతులతోనే పరీక్ష

టెన్త్, ఇంటర్ పరీక్షలంటే స్టూడెంట్స్​కు దడ పుట్టుకొచ్చేస్తది. మరి.. రెండు చేతులూ లేని.. రెండు కాళ్లు కూడా లేని స్టూడెంట్ అయితే..? అబ్బో.. చాలా కష్టం కదూ! కానీ.. ‘నాకు చేతులు, కాళ్లు లేకపోతేనేం..? మోచేతులున్నాయి కదా’ అంటున్నాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన శివం సోలంకీ అనే13 ఏళ్ల కుర్రాడు. ఓ యాక్సిడెంట్ లో చేతులు, కాళ్లు కోల్పోయిన అతడు.. మోచేతులతోనే రాయడం నేర్చుకున్నాడు. టెన్త్ లో ఏకంగా 81 పర్సెంట్ మార్కులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంటర్​లో అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఎగ్జామ్స్ అంటే మరీ అంత టెన్షన్ పడొద్దని తోటి స్టూడెంట్స్ కు ధైర్యం చెప్తున్నాడు శివం. పరీక్షలు మాత్రమే జీవితం కాదనీ, అవే జీవితాన్నంతటినీ డిసైడ్ చేయలేవంటూ వాళ్లలో భయం పోగొడ్తున్నాడు. ‘బాగా ప్రిపేర్ అవండి. బాగా రాయండి’ అంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు. అవసరమైనప్పుడు టీచర్లు ఇంటికి వచ్చి మరీ తన కొడుకు చదువు విషయంలో సాయం చేస్తున్నారని శివం తండ్రి తెలిపారు.

Latest Updates