త్వరలో ఏపీలో లాటరీలు ?

గోవా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లా బాటలో..

ఆదాయం పెంచుకునేందుకు లాటరీలు ప్రారంభించే యోచన

న్యూఢిల్లీ: పన్నుల రాబడి విపరీతంగా తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. లాటరీ వ్యాపారా నికి అనుమతి ఇవ్వడం ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలనే ప్రపోజల్‌ ను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోవా, సిక్కిమ్, అరుణాచల్‌ ప్రదేశ్ సహా 13 రాష్ట్రా లు లాటరీ బిజినెస్‌ ను అనుమతిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు డబ్బు చాలా అవసరం కాబట్టి ఈ వ్యాపారానికి పర్మి షన్ ఇచ్చే ఆలోచన కూడా ఉందని సంబంధి త ఆఫీసర్ ఒకరు చెప్పారు. ఏపీలో లాటరీ వ్యాపా రం సాధ్యాసాధ్యాలను గమనిస్తున్నామని అన్నారు . నిధులకు కటకట ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తున్నది. రెవెన్యూను పెంచుకోవడంలో భాగంగా ఇటీవలే లిక్కర్ ధరలను 75 శాతం వరకు పెంచింది. పెట్రో ప్రొడక్టులపైనా డ్యూటీలను పెంచింది. జెన్‌‌కోలు, డిస్కమ్‌ ల ఆస్తులను ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు బదిలీ చేయనుంది.

Latest Updates