వివాహితతో పరిచయం..ప్రాణం తీసింది

love-affaires-man-death

గచ్చిబౌలి, వెలుగు: వివాహితతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తిని ఆమె భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా కేససముద్రం ప్రాంతానికి చెందిన రమేశ్​తన భార్య శాంతితో కలిసి బతుకుదెరువు కోసం సిటీకి వలస వచ్చి మణికొండలో ఉంటున్నాడు. రమేశ్ అక్కడే పంచవటి కాలనీలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా రేకులబీతండా ప్రాంతానికి చెందిన బానోతు బూచ్య కుమారుడు రాము(28) మణికొండలో కూలీ పనిచేసుకుంటూ అక్కడే ఉండేవాడు. రమేశ్ భార్య శాంతికి రాముతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఈ పరిచయం కొనసాగుతోంది.

మంగళవారం సాయంత్రం 8 గంటలకు రమేశ్​డ్యూటీ ముగించుకుని రూమ్ కు వచ్చేసరికి అక్కడ రాము, శాంతి ఉన్నారు. దీన్ని చూసిన రమేశ్ ఆవేశంతో కత్తితో రాముపై దాడి చేసి కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాము అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల కంప్లయింట్ మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. రాము డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించినట్టు సీఐ రవీందర్ తెలిపారు.

Latest Updates