లవ్, జిహాద్ రెండూ వేర్వేరు.. వాటిని ముడిపెట్టొద్దు

కోల్‌‌కతా: లవ్ జిహాద్‌‌పై దేశవ్యాప్తంగా పలు చర్చలు నడుస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు నేతలు కామెంట్స్ చేశారు. తాజాగా లవ్ జిహాద్‌‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్ స్పందించారు. ప్రేమ, జిహాద్‌‌ను కలపొద్దని, అవి రెండూ వేర్వేరు అంశాలన్నారు. ఎన్నికల సమయంలోనే ఇలాంటి అంశాలను నేతలు లేవనెత్తుతారని నుస్రత్ చెప్పారు.

‘ప్రేమ అనేది వ్యక్తిగత విషయం. లవ్, జిహాద్ భుజాలు కలుపుకొని ముందుకెళ్లే అంశం కాదు. కొందరు నేతలు ఇలాంటి విషయాలను ఎన్నికల ముందు కావాలనే ప్రస్తావిస్తుంటారు. మీరు ఎవరితో ఉండాలనేది మీ వ్యక్తిగత అంశం. మీరు సొంతంగా ఎంచుకునే ఎంపిక అది. మిమ్మల్ని మీరు ప్రేమించండి, అందరూ ఒకరినొకరు ప్రేమించండి. దయచేసి మతాన్ని రాజకీయ వస్తువుగా వాడొద్దు’ అని నుస్రత్ పేర్కొన్నారు.

Latest Updates