ప్రేమ జంట : చెట్టుకు ఉరేసుకొని సూసైడ్

రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. చౌదర్ గూడ మండలంలోని పెద్ద ఎల్కిచెర్ల  గ్రామ ముజాహిదీ పూర్ అడవిలో చెట్టుకు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. మంగళవారం చౌదర్ గూడ మండల పోలీస్ స్టేషన్ లో యువతి, యువకుడు కన్పించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదైంది. ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ చేసుకున్న వారు మిస్సింగ్ కేసుకు సంబంధించిన వారేనా.. లేక వేరే వాళ్లా అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

Latest Updates