ప్రేమ విఫలమైందని.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరి వేసుకుని బలవన్మరణానికి  పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న 26 ఏళ్ల మల్లిరెడ్డి సుబ్రమణ్య రెడ్డి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలం నుంచి అతడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె అతడి ప్రపోజల్‌ను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన సుబ్రమణ్య రెడ్డి సోమవారం రాత్రి తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates