అమ్మా క్షమించు అంటూ ప్రేమికుడి ఆత్మహత్య

LOVE FAILURE SUCIDE IN JAMMIKUNTAకరీంనగర్ జిల్లా: ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్లి అవుతోందని తెలిసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన మరణానికి కారణమేంటో చెప్పాడు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. వంగ సాయికృష్ణ(22)అనే యువకుడు 13 ఏళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలిసి కొందరు స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆమెకు వేరొకరితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది తెలిసిన సాయి కృష్ణ ఆమెను విడిచి బతకలేనంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సారీ మమ్మీ..

ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా ఆ యువకుడి మాటలివి..

‘‘నేను 13 ఏళ్లుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా. తనకీ నేనంటే ఇష్టం. ఈ విషయం తెలిసి ఓ ఇద్దరు వాళ్ల ఇంట్లో చెప్పేశారు. వాళ్ల అమ్మా వాళ్లు ఆమెకు వేరొకరితో పెళ్లి చేసేయాలని చూస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళ్లినా నాకు న్యాయం జరగదు. అమ్మాయి తల్లిదండ్రుల మాటే నెగ్గుతుంది. తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ డిలీట్ చేయించి నన్ను మోసం చేస్తారు. తను లేకుండా నేను బతకలేను. మా పెళ్లికి కూడా అమ్మ ఒప్పుకొంది. నవంబరులో పెళ్లి చేస్తానని చెప్పింది కూడా.. నన్ను కనీ, పెంచిన కుటుంబం కోసం నేను బతకాలి. కానీ నేను అలా చేయలేకపోతున్నా. సారీ అమ్మా.. నేను మోసపోయా. ఈ వీడియో చూసినోళ్లు ఎవరూ నన్ను తప్పుగా అనుకోకండి’’.

 

Latest Updates