‘లవ్ హైదరాబాద్’ ను ఫాలో అవుతున్న కంపెనీలు

సిటీలో లవ్ హైదరాబాద్ సింబల్.. సెల్పీ స్పాట్ గా మారింది. ఇప్పుడిదే కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నాయి కొన్ని సంస్థలు. తమ కంపెనీ, సంస్థ పేరుతో లవ్ సింబల్ ఏర్పాటు చేస్తున్నారు. సిద్ధిపేట, ఖమ్మంలో కూడా లవ్ సింబల్ ఏర్పాటు చేశారు. ఇవి యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఏదైనా కాన్సెప్ట్ బాగుంటే చాలు… అందరూ అదే ఫాలో అవుతుంటారు. అలాంటి వాటిల్లో ఇప్పుడు లవ్ సింబల్ కు ఫుల్ క్రేజ్ పెరిగింది. హైదరాబాద్ లోనే కాదు.. తెలంగాణలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా ఈ లవ్ సింబల్ బ్రాండ్.. ట్రెండ్ నడుస్తోంది.

లవ్ ముంబై సింబల్ ను చూసి.. 2016లో ట్యాంక్ బండ్ పై లవ్ హైదరాబాద్ సింబల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడిది సిటీలో మేజర్ అట్రాక్షన్ గా మారింది. ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో.. దీన్ని నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేశారు. ఇక్కడికి సందర్శకులు, టూరిస్ట్ ల తాకిడి పెరిగింది. యూత్ లవ్ హైదరాబాద్ సింబల్ విజిట్ చేసి.. సెల్ఫీలు దిగుతున్నారు.

హైదరాబాద్ లో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నప్పటికీ.. లవ్ హైదరాబాద్ సింబల్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. యంగ్ స్టర్స్ ఫోటో షూట్స్, ప్రీ-వెడ్డింగ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్ చేయాలంటే లవ్ హైదరాబాద్ సింబల్ కేరాఫ్ గా మారింది. భాగ్యనగరం అంటే చార్మినార్, సైబర్ టవర్స్ చూపించేవారు. ఇప్పుడు మూవీస్, ఫోటోస్, పర్సనల్ వీడియోస్ లో లవ్ హైదరాబాద్ సింబల్ ను చూపిస్తున్నారు.

లవ్ సింబల్ కి ఉన్న పాపులారిటీతో కొన్ని సంస్థలు ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి. అందులో లవ్ ఐవోసి, లవ్ హెచ్ఐసీసీ, లవ్ నుమాయిష్ లాంటి పేర్లతో స్టాచ్యూస్ ఏర్పాటు చేస్తున్నారు. లవ్ సిద్ధిపేట్, లవ్ ఖమ్మం పేర్లతో కూడా సింబల్స్ ఏర్పాటు చేశారు. హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన లవ్ హెచ్ఐసీసీ సింబల్.. ఇక్కడికి వచ్చే ఫారిన్ డెలిగేట్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.  నుమాయిస్ ఎగ్జిబిషన్ లోనూ ఈసారి లవ్ నుమాయిష్ సింబల్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఫోటోస్, సెల్ఫీస్ దిగుతున్నారు. కొత్తగా మొదలైన ఈ లవ్ సింబల్  వ్యాపారులకు మంచి ప్రమోషన్ గా ఉపయోగపడుతోంది.

Latest Updates