చందానగర్ లో లవ్ జిహాద్

Love Jihad in chanda nagar, Hyderabad

హైదరాబాద్ లోని చందానగర్ లో లవ్ జిహాద్ ఉదంతం వెలుగు చూసింది.  హిందు మతానికి చెందిన యువతిని ప్రేమించిన ఓ ముస్లిం యువకుడు పెళ్లి తర్వాత తాను కూడా హిందువుగా మారుతానని నమ్మించి వివాహం చేసుకున్నాడు. అన్ని కుదిరి పెళ్లై, టోలిచౌకీ లో కాపురం పెట్టి, ఓ కుమారుడు కూడా పుట్టాక ఆ యువతినే ముస్లింగా మారాలని ఆ యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు.

ముస్లిం యువతిలాగా వేష ధారణ చేయాలని, ఖురాన్ చదవాలని, తమకు పుట్టిన కుమారుడిని కూడా ముస్లిం లాగే పెంచాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అతని వేధింపులు భరించలేని ఆ యువతి అతడి నుంచి దూరంగా ఉండేందుకు టోలిచౌకీ నుండి హుడా కాలనీ కి తన మకాం మార్చింది.

భార్య, కొడుకు తన నుంచి వీడిపోవడంతో అతడు.. తిరిగి తన దగ్గరికి రాకపోతే చచ్చిపోతా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.  ఇక చేసేదేమి లేక ఆ మహిళ అతడిపై చందా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates