ప్రేమించిన అమ్మాయి కళ్లముందే చనిపోతే ..ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య

వాళ్లిద్దరు గాఢగా ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకోవాలని కలలు గన్నారు. కానీ అంత‌లోనే ఓ విషాదం వారిద్ద‌రిని దూరం చేసింది. ప్రియురాలు మరణించింది. ప్రియుడు అలాగే ఊపిరి ఉన్న జీవశ్చవంలా బతుకుతున్నాడు. రోజురోజుకి ప్రియురాలి జ్ఞాపకాలు ఎక్కువకావడంతో తట్టుకోలేక ఆమె సమాధి వద్ద ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహా దేవపూర్ మండలం కుదురు పల్లికి చెందిన సల్ల మహేష్ అనే యువకుడు ఓ అమ్మాయిని అమితంగా ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక కుంగిపోయాడు. అయితే దసరా పర్వదినం సందర్భంగా ప్రజలు పండగ హడావిడిలో ఉండగా బాధితుడు ప్రియురాలి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలొదిలాడు. ఆత్మహత్యకు ముందు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ పెట్టిన వాట్సాప్ స్టేటస్ తో అప్రమత్తమైన బాధితుడి బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ప్రియురాలి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates