రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

Lovers Commit Suicide on Railway Track

అనంతపురం:  రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని తాడిపత్రి మండలం ఆటోనగర్ దగ్గర ఈ విషాదం జరిగింది. స్థానికులు మృతదేహాలను గుర్తించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Latest Updates