రంగారెడ్డిలో ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. తమ ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో మనస్తాపం చెందిన ఆ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట్ మండలం తొమ్మిదిరేకులు గ్రామానికి చెందిన శ్రీరాములు, సుశీల ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో సుశీల,శ్రీరాములు ఇద్దరూ కలిసి పొలంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. స్థానికులతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం కోసం షాద్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Latest Updates