మన పెళ్లిని పెద్దలు ఒప్పుకోరేమో : రైల్వే ట్రాక్ పై సెల్ఫీ దిగి నవదంపతుల ఆత్మహత్య

కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లి పందిరి తీయకముందే నవదంపతులిద్దరూ అర్ధంతరంగా తనువు చాలించారు. చివరిసారిగా రైల్వే ట్రాక్ పై సెల్ఫీ దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

తమిళనాడులో జరిగిన ఈ ఘటన విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే నవవధువు, వరుడు ఆత్మహత్య చేసుకోవడం ప్రతీఒక్కరిని కలచి వేస్తుంది.

తిరుపత్తూర్‌ జిల్లాకు చెందిన రామదాస్‌ కు, పూంగులమ్‌పుదూర్‌కు చెందిన నందిని  ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. రామదాస్ బెంగళూరులో కూలిపనులు చేస్తుంటే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న నందిని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అయితే వీరిద్దరి ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది. దీంతో  ఒంటరి జీవితం గడుపుతున్న నందినికి అండగా నిలిచేందుకు రామదాస్ సిద్ధమయ్యాడు. అనుకున్నట్లుగా ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ కులాలు, మతాలు వేరుకావడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో తమ పెళ్లిని పెద్దలు అంగీకరించరని భావించిన  రామదాస్, నందినిలు వీరవర్‌ ఆలయ సమీపంలో ఉన్న రైలుపట్టాలపై  చివరిసారిగా సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.  ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates