మైనర్ల ప్రేమ : ప్రియుడు మృతి

గుంటూరు: ఇద్దరి మైనర్ల ప్రేమాయనం చివరికి ప్రియుడి ప్రాణాలమీదికి తెచ్చిన సంఘటన గుంటూరులో జరిగింది. మాచర్ల మండలం బీకేపాలెంకు చెందిన బ్రహ్మయ్య(17), శీలం ముత్తమ్మ (16) ప్రేమించుకున్నారు. పెద్దలకు నచ్చకపోవడంతో ఇరు కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. మనస్తాపంతో ముత్తమ్మ ఫినాయిల్ తాగింది. విషయం తెలిసిన బ్రహ్మయ్య కూడా పురుగుల మందు తాగాడు. ప్రియుడి మృతిచెందగా.. ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. జీవితంపై సరైన అవగాహనలేని వయసులో ప్రేమలోపడటంతోనే బ్రహ్మయ్య, ముత్తమ్మ ఆత్మహత్యయత్నం చేసుకున్నారని తెలిపారు స్థానికులు. చదువుకోవాల్సి వయసులో ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు చెప్పారు.

Latest Updates