పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. త‌ల‌మ‌డుగు మండ‌లం దెగామ గ్రామానికి చెందిన ప్రేమ‌జంట పురుగుల మందు తాగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. వీరిలో యువ‌కుడు గోడెం శ్రీరామ్ మృతి చెంద‌గా.. అపస్మార‌క స్థితిలోకి చేరుకున్న యువ‌తి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఒకే కులానికి చెందిన వీరి ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం యువ‌తి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది.ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన వారిని పోలీసులు విచారిస్తున్నారు.

Latest Updates