రూంమేట్‌కి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ చేసుకున్న లవర్స్

పెట్రోల్​ పోసుకుని ప్రేమజంట ఆత్మహత్య

హాలియా, వెలుగు: ఆ ఇద్దరూ దివ్యాంగులు. కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాలకు చెప్పి పెళ్లి చేసుకునే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకున్నారు. హాలియా ఎస్సై శివకుమార్​తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​జిల్లా ఎడవల్లి మండలం జక్కంపేట గ్రామానికి చెందిన నందిపాటి అశ్విని(20), గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేట గ్రామానికి చెందిన షేక్​మస్తాన్​వలీ(25) కొన్ని నెలలుగా హైదరాబాద్​లోని అమెజాన్​ సంస్థలో పని చేస్తున్నారు. ఇద్దరూ దివ్యాంగులు(వినలేరు, మాట్లాడలేరు) కావడంతో ఆరు నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మస్తాన్​ వలీకి ఐదు సంవత్సరాల క్రితమే మరో అమ్మాయితో వివాహమైంది. అశ్విని తన ఫ్రెండ్​రూంలో ఉంటూ ఉద్యోగం చేస్తుండగా మస్తాన్​ వలీ కుటుంబంతో హైదరాబాద్​లోనే ఉంటున్నాడు. ఈ నెల 7న అశ్విని ఆఫీసుకు వెళ్తున్నానంటూ రూం నుంచి బయలుదేరింది. మరుసటి రోజు సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె రూమ్మేట్​హూమయూన్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బయటకు వెళ్లిన అశ్విని ఈ నెల 9న మస్తాన్​ వలీతో కలిసి బైక్​పై నాగార్జునసాగర్​వెళ్లింది. సాయంత్రం ఇద్దరూ అనుముల మండలం పాలెం స్టేజీ సమీపానికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో అశ్విని తన రూమ్మేట్​ధనలక్ష్మీకి వీడియో కాల్​ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ధనలక్ష్మీకి మరోసారి ఫోన్​చేసింది. ఆ సమయంలో గూగుల్​ లొకేషన్​ పోస్ట్​ చేసింది. అనంతరం ఇద్దరూ వారివెంట తెచ్చుకున్న పెట్రోల్​ పైన పోసుకుని నిప్పంటించుకున్నారు.

గూగుల్​ లొకేషన్​ ఆధారంగా..

అశ్విని గూగుల్​ లొకేషన్​ షేర్ ​చేయడంతో ధనలక్ష్మి ఫ్రెండ్స్​తో కలిసి గురువారం ఉదయానికి ఆ ప్రాంతానికి చేరుకుంది. అప్పటికే పొలానికి వచ్చిన రైతు శేషయ్య ఇద్దరి మృతదేహాలను చూసి వెంటనే హాలియా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సాగర్​ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు.

For More News..

రిలయన్స్‌ వాటాలు కొంటున్న అమెజాన్

ఇంట్లో పాత సామాను తీస్తుంటే.. రూ. 95 లక్షల విలువైన మగ్గు దొరికింది

బ్యాన్​ చేసిన​ చైనా యాప్స్​ను అమ్మాల్సిందే!

Latest Updates