బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం.. రాష్ట్రంలో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో వ‌ర్షాలు ప‌డ‌నున్న‌ట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఉపరితల అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు మరియు సోమ‌వారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

Latest Updates