వరుసగా రెండో నెలలోనూ పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు

న్యూఢిల్లీ: అన్‌లాక్‌లో నాన్ సబ్సిడీ గ్యాస్ ఎల్‌పీజీ రేట్లు మరోసారి పెరిగాయి. వంట కోసం వాడే ఈ సిలిండర్ల ధర వరుసగా రెండో నెలలోనూ పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ ధర ఆర్‌‌ఈ 1 మేర పెరగడంతో 14.2 కేజీల సిలిండర్ ప్రైస్ రూ.594కు చేరుకుంది. సేల్స్ ట్యాక్సెస్‌లో వైవిధ్యం, వ్యాట్‌ రేట్స్‌ వల్ల మిగతా మెట్రో సిటీల్లో సిలిండర్ ధరలు రూ.4 మేర పెరిగాయి. మరోవైపు గత మూడు వారాల్లో 22 సార్లు పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా రెండో రోజు ఎలాంటి హెచ్చుదల లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.43గా ఉంది. కాగా, జెట్ ఫ్యుయల్ లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్) ధరలు 7.5 శాతం మేర బుధవారం పెరిగాయి. ఒక నెల వ్యవధిలో ఇలా ఫ్యుయల్ రేట్స్ పెరగడం ఇది మూడోసారి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధర రూ.2,922.94 పెరగడంతో ప్రస్తుతం కిలో లీటర్‌‌ టర్బైన్ ఫ్యుయల్ రేట్స్‌ ప్రైస్ రూ.41,992.81కు చేరుకుంది.

Latest Updates