మీ పిల్లలు టెర్రరిస్టులు కావొద్దు: కశ్మీరీ తల్లులకు ఆర్మీ వినతి

జమ్మూ కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్నపిల్లల్ని టెర్రిరిస్టులు పావులుగా వాడుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పిల్లల్ని , యువకుల్ని టెర్రర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావజాలంతో ప్రభావితం చేసి తమవైపు తిప్పుకుంటున్నారు. ఆర్మీపై దాడులకు వారిని టెర్రరిస్టులు వాడుకుంటున్నారు. తాజాగా జమ్మూ బస్టాండ్ లో గ్రెనెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడిచేసింది మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం ఇండియన్‌ ఆర్మీ అధికారుల్ని ఆందోళనకు గురిచేసింది. అందుకే పెద్దసంఖ్యలో యువత టెర్రిరిజంలో చేరకుండా జాగ్రత్తపడాలని కశ్మీరీ పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలిసో ,తెలియకో టెర్రరిజంవైపు ఆకర్షితులై ఆమార్గాన్ని ఎంచుకున్నా.. తిరిగి పశ్చాత్తాపంతో వెనక్కివస్తే వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకునే బాధ్యతను ఆర్మీ తీసుకుంటుందని ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్జీత్‌ సింగ్ థిల్లాన్ హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌ ఫాంట్రీలో రాష్ట్రానికి చెందిన 152 మంది యువకులు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లెఫ్టినెంట్ జనరల్ కన్వల్జీత్‌ సింగ్ థిల్లాన్ మాట్లాడారు. ‘‘కశ్మీరీ తల్లులకు ఇదే నా రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. మీ కుమారుల్ని వెంటనే సరెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్మని చెప్పండి. తుపాకిపడితే మాత్రం వాళ్లను చంపడం ఖాయం’’ అని ఆయన సూచించారు.

Latest Updates