ఆర్మీ వైస్‌ చీఫ్‌ గా ముకుంద్‌ నారవానే

లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌‌ నారవానే ఆర్మీ వైస్‌ చీఫ్‌ గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అన్బూ శనివారం రిటైర్‌‌‌‌ అవటంతో మనోజ్‌ ను ఈ పదవిలో నియమించినట్లు అధికారులు చెప్పారు. ఆర్మీ వైస్‌ చీఫ్‌ గా బాధ్యతలు చేపట్టక ముందు మనోజ్ ఈస్ట్రన్‌‌ కమాండ్‌ఆఫ్‌ ఆర్మీకి హెడ్‌ గా వ్యవహరిం చారు. 1980 జూన్‌‌లో సర్వీస్‌ లో చేరిన మనోజ్‌ జమ్మూకాశ్మీర్‌‌‌‌, నార్త్‌ ఈస్ట్‌‌ ప్రాంతాల్లో పనిచేశారు.“సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో పనిచేసిన ఆయన తన అనుభవాన్ని ఇక్కడికి తీసు కొస్తున్నా రు” అని ఆర్మీ చెప్పింది. మనోజ్‌ సేవలకు గాను ప్రభుత్వం ఆయన్ను సేనా మెడల్‌ , విశిష్ట సేవా మెడల్‌ , పరమ విశిష్ట సేవా మెడల్స్‌‌తో సత్కరించిం ది. ఆర్మీలో సీనియర్‌‌‌‌ మోస్ట్‌‌ అయిన ముకుంద్‌‌  నారవానే ఆర్మీ చీఫ్‌ పోస్టుకు పోటీలో ఉన్నట్లు సమాచారం.

Latest Updates