(వీడియో) : కమల్ నాథ్ ఓ తాగుబోతు అంటూ బూతు పురాణం

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీల నేత మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్.., బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి ఇమ్రతీ దేవి  ఐటమ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కమల్ నాథ్ వ్యాఖ్యలపై ఇమ్రతీ దేవి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన అలా మాట్లాడితే నేను మాట్లాడలేనా అంటూ మండిపడ్డారు. అటువంటి భాషను ఉపయోగించే  కమల్ నాథ్ ఒక లుచ్చా, లఫంగ్,  తాగుబోతులా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు.

కాగా ఇమ్రతీ దేవీపై చేసిన వ్యాఖ్యలపై తాను ఎవరికి క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. నేను ఏదో చెప్పాను,ఎవరినీ అవమానించ లేదు.  నాకు ఆ (వ్యక్తి) పేరు గుర్తులేదు . తన చేతిలో ఉన్న పేపర్ ను చూస్తూ ఐటమ్ నెం .1, ఐటమ్ నెం .2 అని అన్నాను. ఇది ఒకరిని అవమానించినట్లుగా ఉందా.  శివరాజ్ సాకులు వెతుకుతున్నారు. కమల్ నాథ్ ఎవరినీ అవమానించరని తనని తాను సపోర్ట్ చేసుకున్నారు.

Latest Updates