టెస్టుల్లో ఆ చాన్స్‌‌ వస్తే లక్కీ.. ఓపెనింగ్‌కైనా రెడీ

  • టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ వాషింగ్టన్‌‌ సుందర్‌‌

ఆస్ట్రేలియా టూర్‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ముగించిన టీమిండియాకు ఈసారి చాలా మంది కొత్త హీరోలు దొరికారు. అందులో 21 ఏళ్ల వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ కూడా ఒకడు. గబ్బా టెస్ట్‌‌‌‌లో అరంగేట్రం చేసిన ఈ ఆఫ్‌‌‌‌ స్పిన్ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ ఇండియా..  బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీ నిలబెట్టుకోవడంలో కీ రోల్‌‌‌‌ పోషించాడు. బ్రిస్బేన్‌‌‌‌లో నాలుగు వికెట్లు తీసిన ఈ యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌.. ఆ మ్యాచ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌తో కలిసి బ్యాట్‌‌‌‌తో అద్భుతం చేశాడు. సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో టెన్షన్‌‌‌‌ లేకుండా చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌‌‌‌తోనే హీరోగా మారిన ఈ తమిళనాడు చిన్నోడు.. చాన్స్‌‌‌‌ ఇస్తే ఓపెనర్‌‌‌‌గా వస్తానని అంటున్నాడు. కోచ్‌‌‌‌ రవిశాస్త్రి ఇచ్చిన స్ఫూర్తి వల్లే సక్సెస్‌‌‌‌ సాధించానన్న ఈ లెఫ్టాండ్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌.. నెట్‌‌‌‌బౌలర్‌‌‌‌గా రెడ్‌‌‌‌ కుకాబుర్రా బాల్‌‌‌‌తో గంటల తరబడి బౌలింగ్‌‌‌‌ చేయడం తనకు ప్లస్‌‌‌‌ అయ్యిందన్నాడు. స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి వికెట్ల ఖాతా తెరిచిన ఈ యంగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌… బ్రిస్బేన్‌‌‌‌లో తన సెన్సేషనల్‌‌‌‌ డెబ్యూతోపాటు ఫ్యూచర్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌ గురించి ఏమన్నాడో తెలుసుకుందాం.

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో ఇండియా టీ20 జట్టులో చాన్స్‌‌‌‌ దక్కించుకున్న వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌… ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో వైట్‌‌‌‌ బాల్‌‌‌‌ సిరీస్‌‌‌‌లకు సెలెక్ట్‌‌‌‌ అయ్యాడు. కానీ టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు మాత్రం నెట్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా ఎంపికయ్యి జట్టుతోనే కలిసున్నాడు. టీ20 సిరీస్‌‌‌‌లో ఒకే ఒక్క మ్యాచ్‌‌‌‌ ఆడిన సుందర్‌‌‌‌.. సీనియర్ల గాయపడటంతో టెస్ట్‌‌‌‌ చాన్స్‌‌‌‌ కొట్టేశాడు. అనుకోకుండా దొరికిన చాన్స్‌‌‌‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఇటు బ్యాటింగ్‌‌‌‌, అటు బౌలింగ్‌‌‌‌లో సత్తా చూపెట్టి సిసలైన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అనిపించుకున్నాడు. హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి  డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో చెప్పిన మాటల వల్లే తాను ఈ రోజు ఇంత సక్సెస్‌‌‌‌ సాధించానని సుందర్‌‌‌‌ అంటున్నాడు. అండర్‌‌‌‌–19 టీమ్‌‌‌‌కు ఆడే రోజుల్లో టాపార్డర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ చేసిన సుందర్‌‌‌‌.. ఇప్పుడు చాన్స్‌‌‌‌ దొరికితే టెస్టుల్లో ఇండియాకు ఓపెనింగ్‌‌‌‌ చేస్తానని అంటున్నాడు. బ్రిస్బేన్‌‌‌‌లో సుందర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ వెనుక అసలేం జరిగిందో అది అతని మాటల్లోనే..

చాన్స్‌‌‌‌ ఇస్తే ఓపెనింగ్‌‌‌‌ చేస్తా..

టెస్టుల్లో ఇండియా తరఫున ఓపెనర్‌‌‌‌గా ఆడే అవకాశం వస్తే నాకు దక్కిన అదృష్టంగా భావిస్తా.  మా కోచ్‌‌‌‌ రవి సర్‌‌‌‌ తాను ఆడే రోజుల్లోఎలాంటి చాలెంజ్‌‌‌‌కైనా ఏ విధంగా రెడీగా ఉండేవారో… నేను కూడా ఆయనలాగే సవాళ్లు స్వీకరిస్తా. డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో రవి సర్‌‌‌‌ తన కెరీర్‌‌‌‌కు సంబంధించిన చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అవన్నీ చాలా ఇన్‌‌‌‌స్పైరింగ్‌‌‌‌గా ఉండేవి. స్పెషలిస్ట్‌‌‌‌  స్పిన్నర్‌‌‌‌గా న్యూజిలాండ్‌‌‌‌పై ఆయన టెస్ట్‌‌‌‌ అరంగేట్రం చేయడం. తొలి మ్యాచ్‌‌‌‌లో నాలుగు వికెట్లు సాధించడం, పదో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌కు రావడం గురించి చెప్పారు. అక్కడి నుంచి ఆయన ఓపెనర్‌‌‌‌గా ఎలా మారారు, అప్పటి గొప్ప ఫాస్ట్‌‌‌‌ బౌలర్లను ఎలా ఫేస్‌‌‌‌ చేశారు వంటివి మాతో పంచుకున్నారు. చాన్స్‌‌‌‌ దొరికితే నేను కూడా ఆయన లాగే ఇండియా తరఫున టెస్ట్‌‌‌‌ల్లో ఇన్నింగ్స్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చెయ్యాలనుకుంటున్నా..

డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌ సూపర్బ్‌‌‌‌..

ఓ యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌గా ఇన్స్‌‌‌‌పిరేషన్‌‌‌‌, మోటివేషన్‌‌‌‌ కోసం నేను ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు. మా డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లోనే కావాల్సినంత మంది గొప్ప ప్లేయర్లున్నారు. విరాట్‌‌‌‌ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానె, అశ్విన్‌‌‌‌తోపాటు చాలా మంది  గొప్ప పెర్ఫామర్లు మా డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో ఉన్నారు. వీళ్లలో ఎవరిని ఏ డౌట్‌‌‌‌ అడిగినా సరే సాయం చేయడానికి ముందుకు వస్తారు. ధైర్యం నింపి కావాల్సినంత  ప్రోత్సాహం అందిస్తారు.

అంతా అరుణ్‌‌‌‌ సార్‌‌‌‌ ప్లానే..

మా బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ భరత్‌‌‌‌ అరుణ్‌‌‌‌ సార్‌‌‌‌ చేసిన ప్లాన్‌‌‌‌ వల్లే టెస్ట్‌‌‌‌ల కోసం నన్ను నెట్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా ఆసీస్‌‌‌‌లోనే ఉంచారు. అదే నాకు చాలా లాభం చేసింది. ఆస్ట్రేలియా పిచ్‌‌‌‌ల్లో సాధారణంగా పేస్‌‌‌‌, బౌన్స్‌‌‌‌ ఎక్కువ లభిస్తాయి. అందువల్ల స్లో బాల్స్‌‌‌‌ వేయకూడదు. దాంతో డెలివరీలో కొంచెం ఫ్లయిట్‌‌‌‌తో పాటు బౌన్స్‌‌‌‌ ఉండేలా చూసుకున్నాం. అలా బౌలింగ్‌‌‌‌ చేయగలిగితే వికెట్‌‌‌‌ మీద పేస్‌‌‌‌ను ఉపయోగించుకోవచ్చు. నెట్‌‌‌‌ సెషన్స్‌‌‌‌లో దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టా. అనుకున్నట్టుగానే బ్రిస్బేన్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ తొలి రోజూ పిచ్‌‌‌‌ నుంచి స్పిన్నర్లకు సహకారం లేదు. అయినా నేను  తొలి వికెట్‌‌‌‌గా స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చెయ్యడంతో కల నెరవేరినట్టు అనిపించింది.

మాపై మాకు నమ్మకముంది

గబ్బా టెస్ట్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ రోజు ఆటలో లాస్ట్‌‌‌‌ 10 ఓవర్లలో మేము 50 రన్స్‌‌‌‌ వరకు సాధించాల్సి ఉంది. కానీ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌తో కలిసి  టార్గెట్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ చెయ్యగలమని నమ్మకం ఉంది. క్రీజులో ఓ వైపు రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ ఉండటం వల్ల ఆసీస్‌‌‌‌ బౌలర్లు చాలా ఒత్తిడిలో ఉన్నారన్న సంగతి మాకు అర్థమైంది. దాంతో 25 నుంచి 30 రన్స్ ఫాస్ట్‌‌‌‌గా చెయ్యగలిగితే టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌ ఈజీ అయిపోతుందని  గ్రహించాం. ఇక ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, నేను చాలా మంచి పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ చేశాం. ఆ టైమ్‌‌‌‌లో ఠాకూర్‌‌‌‌ చాలా అద్భుతంగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు.

ఇవి కూడా చదవండి..

రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ క్రికెట్‌‌ డైరెక్టర్‌‌గా సంగక్కర

ఉత్తరాఖండ్​కు.. ఒక్కరోజు సీఎంగా కాలేజీ అమ్మాయి

చదలవాడ హేమేశ్​కు బాల పురస్కార్

 

 

Latest Updates