మహిళల రక్షణ కోసం : రాత్రివేళల్లో పోలీసుల ఫ్రీ క్యాబ్ సర్వీస్

మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ రాత్రివేళల్లో ఉచిత క్యాబ్ సర్వీస్ లను అందుబాటులోకి తెచ్చింది.

దేశంలో నిర్భయలాంటి చట్టాలు అందుబాటులోకి తెచ్చిన కామాంధులు పేట్రోగిపోతున్నారు. ఆడది ఒంటిరిగా కనిపిస్తే చాలు తోడేళ్లలా విరుచుకుపడి దారుణానికి ఒడిగడుతున్నారు.

దిశలాంటి ఘటనల తరువాత అన్నీ రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖ మహిళలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. పంజాబ్ లోని లార్జెస్ట్ ఇండస్ట్రీయల్ సిటీగా పేరొందిన లుథియానాలో రాత్రివేళల్లో మహిళలకు ఉచిత క్యాబ్ సర్వీస్ లను అందిస్తున్నట్లు కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు.

రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఉచిత క్యాబ్ సర్వీస్

రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు మహిళలకు ఉచితంగా క్యాబ్ సర్వీస్ లను అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందితో పాటు, శక్తి యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

రాత్రి వేళల్లో  మహిళలకి పోలీసుల సాయం కావాలంటే  శక్తియాప్ లో ఉన్న సాస్ బటన్ ను క్లిక్ చేయాలని , తద్వారా సదరు మహిళ ఏ ప్రాంతంలో ఉందనే వివరాలు స్థానికంగా ఉండే పది పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ వెళుతుందని అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ తో సిబ్బంది అలర్టై మహిళల్ని సేఫ్ గా ఇంటికి చేరుస్తామన్నారు. శక్తి యాప్ ను నవంబర్ నెలలో 2,500మహిళలు డౌన్ లోడ్ చేసుకున్నారని, ఆ సంఖ్యను పెంచేలా అవెర్ నెస్ పోగ్రాంలను కండక్ట్ చేస్తున్నట్లు రాకేష్ అగర్వాల్ చెప్పారు.

ఫ్రీ రైడ్ కోసం హెల్ప్ లైన్ నెంబర్లు..

రాత్రివేళల్లో పోలీసుల సాయంతో ఫ్రీరైడ్ అవసరం ఉన్న మహిళలు హెల్ప్ లైన్ నెంబర్లు 1091, 7837018555 కు కాల్ చేస్తే పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారాని సీపీ రాకేష్ అగర్వాల్ తెలిపారు.

 

Latest Updates