700 కోట్ల వ్యూస్ సాధించిన వీడియో ఇదే..

ఒక వీడియోకు యూట్యూబ్‌‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌‌ రావడం అంత తేలిక కాదు. వ్యూయర్స్‌‌కు ఎంతో నచ్చితేనే మిలియన్స్‌‌ వ్యూస్‌‌ వస్తాయి. మన దగ్గర ఈమధ్య అనేక మ్యూజికల్‌‌ వీడియోస్ వంద మిలియన్ల క్లబ్‌‌లో చేరుతున్నాయి. ఇంకా మన వీడియోస్‌‌ బిలియన్‌‌ (వంద కోట్లు) వ్యూస్‌‌కు దూరంలోనే ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా వీడియోస్‌‌ బిలియన్ల కొద్దీ వ్యూస్‌‌తో యూట్యూబ్‌‌లో దూసుకెళ్తున్నాయి. ఈమధ్య కాలంలో యూట్యూబ్‌‌లో అత్యధిక వ్యూస్‌‌ పొందిన వీడియోస్‌‌ ఇవి.

లూయిస్‌‌ ఫోన్సీ (700 కోట్ల వ్యూస్‌‌)

యూట్యూబ్‌‌లో అత్యధిక వ్యూస్‌‌తో ట్రెండ్‌‌ సృష్టించిన మ్యూజికల్‌‌ వీడియో ‘లూయిస్‌‌ ఫోన్సీ: డెస్పాసిటో’. పోర్టోరికో సింగర్‌‌‌‌ లూయిస్‌‌ ఫోన్సీ, ర్యాపర్‌‌‌‌ డాడీ యాంకీ కలిసి చేసిన ఈ సాంగ్‌‌ సూపర్‌‌‌‌హిట్టైంది. 2017 జనవరిలో రిలీజైంది. ఇప్పటివరకు యూట్యూబ్‌‌లో దాదాపు 700 కోట్ల వ్యూస్‌‌ వచ్చాయి. ఈ సాంగ్‌‌కు వచ్చిన లైక్స్‌‌ 39 మిలియన్స్‌‌.

బేబి షార్క్‌‌ డ్యాన్స్‌‌ (640 కోట్ల వ్యూస్‌‌)

వ్యూస్‌‌ పరంగా యూట్యూబ్‌‌లో సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉన్న వీడియో ఇది. 2016 జనవరిలో రిలీజైన ఈ పాటకు ఇప్పటివరకు 640 కోట్లకుపైగా వ్యూస్‌‌ వచ్చాయి. షార్క్‌‌ చేపలతో కూడిన యానిమేషన్స్‌‌, పిల్లల లైవ్‌‌ డ్యాన్స్‌‌తో ఈ వీడియో రూపొందింది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ సాంగ్‌‌ పిల్లలకు బాగా నచ్చింది.

షేప్‌‌ ఆఫ్‌‌ యు (490 కోట్ల వ్యూస్‌‌)

బ్రిటన్‌‌కు చెందిన ఎడ్‌‌ షీరన్‌‌కు వరల్డ్‌‌వైడ్‌‌ ఫేమ్‌‌ తెచ్చిపెట్టిన సాంగ్‌‌ ‘షేప్‌‌ ఆఫ్‌‌ యు’. 2017 జనవరిలో రిలీజైన ఈ సాంగ్‌‌ యూట్యూబ్‌‌లో వ్యూస్ పరంగా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 490 కోట్లకు పైగా వ్యూస్‌‌ సాధించింది. మన దేశంలో కూడా పెద్ద హిట్టైంది. 34 దేశాల్లో చాలా కాలంపాటు నెం.1 స్థానంలో ట్రెండ్‌‌ అయింది. దీనికి ఎన్నో కవర్‌‌‌‌ సాంగ్స్‌‌ కూడా మన దగ్గర రూపొందాయి.

సీ యు ఎగైన్‌‌ (471 కోట్ల వ్యూస్‌‌)

యూట్యూబ్‌‌లో వ్యూస్‌‌ పరంగా నాలుగో స్థానంలో నిలిచిన వీడియో సాంగ్‌‌ ‘సీ యు ఎగైన్‌‌’. ప్రముఖ అమెరికన్‌‌ సింగర్స్‌‌ విజ్‌‌ ఖలీఫా, చార్లీ పుత్‌‌ కలిసి రూపొందించిన వీడియో ఇది. మ్యూజిక్‌‌ లవర్స్‌‌ను బాగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌‌కు ఇప్పటివరకు 471 కోట్లకు పైగా వ్యూస్‌‌ వచ్చాయి.

మాషా అండ్‌‌ ద బేర్‌‌‌‌ (390 కోట్ల వ్యూస్‌‌)

పిల్లల కోసం రూపొందిన రష్యన్‌‌ టీవీ సిరీస్‌‌కు చెందిన మ్యూజిక్‌‌ వీడియో ‘మాషా అండ్‌‌ ద బేర్‌‌‌‌:రెసిపీ ఫర్‌‌‌‌ డిజాస్టర్‌‌‌‌’. యానిమేటెడ్‌‌ క్యారెక్టర్స్‌‌తో ఉన్న ఈ వీడియో పిల్లలకు బాగా నచ్చింది. ఒక యానిమేటెడ్‌‌ ఎలుగుబంటి, మాషా అనే చిన్నారి కలిసి వంట చేయడం అనే కాన్సెప్ట్‌‌తో ఈ వీడియో రూపొందింది. వ్యూస్‌‌ పరంగా యూట్యూబ్‌‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 390 కోట్లకు పైగా వ్యూస్‌‌ సాధించింది.

 

Latest Updates