గాలి కాలుష్యంతో.. ఎముకలు పెళుసైతున్నయ్

సికింద్రాబాద్, వెలుగు: గాలి కాలుష్యం వల్ల లంగ్స్ దెబ్బతింటాయని, శ్వాస సంబంధమైన సమస్యలు, లంగ్ కేన్సర్ వంటివి వస్తాయని మనకు తెలుసు. కానీ కలుషితమైన గాలి పీలిస్తే.. ఎముకలు కూడా వీక్ అయిపోయి ‘ఆస్టియోపోరోసిస్’ సమస్య వస్తుందట. బోన్స్ పెళుసుగా మారిపోయి.. చిన్నపాటి ప్రెజర్ కే పుటుక్కున విరిగిపోయే ప్రమాదం పెరుగుతుందట. హైదరాబాద్ సిటీ శివార్లలోని 28 గ్రామాల్లో 6,900 మందిపై చేసిన రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడైంది. స్పెయిన్ కు చెందిన బార్సిలోనా ఇనిస్టిట్యూ ట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆధ్వర్యం లో లండన్ స్కూల్ ఆఫ్​హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్​న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సంస్థలు కలిసి ఈ రీసెర్చ్ చేశాయి. దీంతో కలుషితమైన గాలి పీల్చినవారిలో ఎముకలు పెళుసుగా మారి, ఆస్టియో పోరోసిస్ బారిన పడుతున్నట్లు వెల్లడైంది.

కాలుష్యంతో క్యాల్షియం తగ్గుతది..

రీసెర్చ్ లో భాగంగా.. యావరేజ్ గా 35 ఏళ్ల లోపు వయసున్న 6,900 మందిలో ఎముకల డెన్సి టీ (సాంద్రత), వాటిలో ఉన్న మినరల్స్ ను విశ్లేషించారు. దీంతో కలుషిత గాలిని పీల్చినవారి ఎముకల డెన్సి టీ తగ్గిందని, వారి ఎముకల్లోని మినరల్స్ క్షీణించాయని గుర్తించారు. వెహికల్స్, ఇండస్ట్రీల్లో ఫ్యూయెల్స్ మండినప్పుడు కాలుష్యపూరిత కణాలు గాలిలోకి విడుదలవుతాయి. వీటితో పాటు దుమ్ము, ధూళి కణాలు గాలిలో కలుస్తుంటాయి. ఇలా కెమికల్, ధూళి కణాలు గాలిలో కలిస్తే వాటిని పర్టిక్యు లేట్ మ్యాటర్ (పీఎం) అంటారు. అయితే పీఎం 2.5 కణాలు, బ్లాక్ కార్బన్ వంటివి ఉన్న గాలిని పీలిస్తే.. ఎముకల్లో డీమినరలైజేషన్ జరుగుతోం దని, అందుకే క్యాల్షియం మినర్ క్షీణించి ఎముకలు పెళుసుగా మారుతున్నాయని కనుగొన్నట్లు ఎన్ఐఎన్ సైంటిస్టులు వెల్లడించారు. ఎయిర్ పొల్యూషన్ పిల్లల్లోనూ ఎముకల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. మహిళల్లో ప్రీ మెనోఫాజ్ కు కారణమని కూడా గుర్తిం చామన్నారు.

Latest Updates