హిందీలో హిట్టైన లస్ట్ స్టోరీస్ తెలుగులో రాబోతుంది

బాలీవుడ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీ  తెలుగు ప్రేక్షకుల్ని కనువిందు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందించిన లస్ట్ స్టోరీస్ బాలీవుడ్ లో ఎంతపాపులర్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు అదే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి నిర్మాత రోనీ స్క్రూవాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ వెబ్ సిరీస్ లో హీరోయిన్లుగా రాధికా ఆప్టే, కైరా అద్వానీ, భూమి పెండేకర్, మనీషా కోయిరాలా, నేహా దూఫియాలు ఆకట్టుకున్నారు. ఇక తెలుగు లస్ట్ స్టోరీ కోసం అమలాపాల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలుగు రీమేక్ కి నందిని రెడ్డి, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ వంటి దర్శకుల్ని ఎంపిక చేసుకున్నట్లు టాక్.

Latest Updates