సిద్దిపేట ప్రజల కోసం LV ప్రసాద్ ఆస్పత్రి

సిద్దిపేట : వేలాది మందికి వెలుగును ఇచ్చిన వ్యక్తి హెటేరో చెర్మెన్ పార్థసారథి రెడ్డి అన్నారు మంత్రి హరీష్ రావు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాగులబండ్డలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. LV ప్రసాద్ ఆస్పత్రి 1987 ప్రారంభం చేసి నాలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రజలకు సేవాలు అందిస్తున్నారని తెలిపారు.  బంజారాహిల్స్ ఆస్పత్రిలో ఏ మెటీరియల్ ఉందొ, సిద్దిపేట ఎల్వి ప్రసాద్ ఆస్పత్రిలో కూడా అదే ఉంటుందన్నారు.  సిద్దిపేట జిల్లా ప్రజలు మంచిగా వినియోగించుకోవాలని.. LV ప్రసాద్ ఆస్పత్రిలో కంటి చూపుపై శిక్షణ ఇస్తారన్నారు.

నాలుగు రాష్ట్రాల్లో 19 ఎల్వి ప్రసాద్ సెంటర్లు ఉన్నాయని.. హైదరాబాద్ లో రూ. 400కోట్లతో పార్థసారథి రెడ్డి  క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. మొదటగా సిద్దిపేటలో క్యాన్సర్ స్కీనింగ్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలని.. జిల్లా చుట్టూపక్కాల ఉన్న 5లక్షల ప్రజలు కంటి చూపు, బీబీ, షుగర్ ఉన్నవాళ్లు వినియెగించుకోవాలని తెలిపారు. తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా మారాలనేదే కేసీఆర్ కోరికన్నారు. గతంలో హైదరాబాద్, వరంగల్ లో మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండేవని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజీలు తేవడం జరిగిందన్నారు మంత్రి హరీష్ రావు.

SEE ALSO:పిల్లలు బెట్టింగ్ ఉచ్చులో చిక్కితే ఇలా కనిపెట్టొచ్చు

రైల్లో పరిచయం .. లాడ్జిలో అత్యాచారం

 

 

Latest Updates