ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం

LV Subrahmanyam new Chief Secretary of AP as ECI boots out Anil Chandra Punetha

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకముందు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు.ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ ..అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

కాగా అంతకుముందు ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.. ఆయన స్థానంలో ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది.

 

 

Latest Updates