‘మజిలీ’ మాయ : మరోసాంగ్ విడుదల

అక్కినేని నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా మజిలీ. మూవీలో దివ్యాంశు కౌశిక్ మరో కథానాయిక. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ అందించిన ఈ మూవీ పాటలు… ఇటీవలే విడుదలయ్యాయి. స్పందన కూడా బాగుంది. ప్రమోషన్ లో ఉన్న చిత్రయూనిట్.. మాయా మాయా పాటకు సంబంధించిన వీడియో టీజర్ ను విడుదల చేసింది.

“గబ గబ సూర్యుడ్నేమో పిలిచ్దేదాం.. గబగబరావొద్దంటూ చంద్రున్ని ఆపేద్దాం..  మనసెక్కడ కర్చీఫ్ ఏసిందో.. మనమక్కడ జెండా పాతేద్దాం.. బంతి బౌండరీ దాటిన ఫ్రీడమ్ ఇదే .. చల్ చల్ చల్ చల్.. ఏతావాతా ఇరగేసేద్దాం మాయా… మనసే రైలు కూతా అరిపించేద్దాం మాయా..” అంటూ ఈ పాట హుషారుగా సాగుతుంది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటను.. రైటర్ భాస్కరభట్ల రాశాడు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతున్న మజిలీ సినిమాకు శివనిర్వాణ దర్శకుడు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సంగీత దర్శకుడు తమన్ అందిస్తున్నాడు.

Latest Updates