మేడిన్‌ ఇండియా పుంజుకుంటోంది

కాంట్రాక్ట్‌ ‌మాన్యుఫ్యాక్చరర్లకు పెరుగుతున్నఆర్డర్లు

న్యూఢిల్లీ: ఇప్పటికే పాపులరైనా, కొత్తగా ఎంట్రీ ఇస్తున్న బ్రాండ్లు ఇండియాలోనే తమ మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌ను చేపట్టాలని భావిస్తున్నాయి. ఈ బ్రాండ్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయని ఇండియన్‌ కాంట్రాక్ట్‌ ‌‌‌మాన్యుఫ్యాక్చరర్లు చెబుతున్నారు. టీవీలు, ఏసీలు, మైక్రోవేవ్‌ ఓవెన్‌లు, షూస్‌, స్పీకర్స్‌‌‌‌, ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌‌‌‌ , సెట్‌టాప్‌‌‌‌ బాక్స్‌‌‌‌లు, క్లాత్స్‌‌‌‌వంటి ప్రొడక్ట్ ల‌‌‌ తయారీలో ఇండియన్‌ కాంట్రాక్ట్‌ ‌‌‌మాన్యుఫ్యాక్చరర్లకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. బార్డర్‌ ‌‌‌‌‌‌‌గొడవలతో చైనాలో తయారైన ప్రొడక్ట్ లను ‌బాయ్‌కాట్‌ చేయాలని దేశంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. దిగుమతులపై సుంకాలను ప్రభుత్వం
పెంచుతుందనే వార్తలూ వినిపిస్తున్నా యి. దీంతో తమ మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌ను ఇండియాలోనే చేపట్టాలని వివిధ బ్రాండ్లు ప్లాన్స్‌‌‌‌ వేస్తున్నాయి. కరోనా ఔట్‌బ్రేక్‌‌‌‌తో చైనా నుంచి ఫినిష్డ్‌‌ ‌‌గూడ్స్‌ ‌‌‌దిగుమతులను తగ్గించుకుంటున్నామని థర్డ్‌ పార్టీ మాన్యుఫ్యాక్చరర్లు డిక్సన్‌, వీడియో టెక్స్‌ ‌‌‌ఇంటర్నేషనల్‌‌‌‌, ఎస్‌ఎస్‌ఐపీఎల్‌‌‌‌ వంటి కంపెనీలు చెబుతున్నాయి. తాజాగా బార్డర్‌ ‌‌‌ఇష్యూ, వోకల్‌‌ ‌‌ఫర్‌ ‌‌‌‌‌‌‌లోకల్‌ ‌‌‌థీమ్‌ పెరుగుతుండడంతో తమ సప్లయ్ చెయిన్‌ను చైనా నుంచి మారుస్తున్నామని పేర్కొన్నాయి. కానీ రా మెటీరియల్స్‌‌‌‌, విడి భాగాలను మాత్రం ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. చైనాకు పోటీగా ఏ దేశం కూడా వీటిని తయారు చేయకపోవడమే దీనికి కారణం. ‘ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా కంపెనీల చర్యలుంటాయి. దిగుమతులపై అదనంగా సుంకాలను విధిస్తే, ఈ కంపెనీలు ప్రత్యమ్నాయాలను వెతుక్కుంటాయి’ అని ఇండియా–చైనా ట్రేడ్‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌ వీకే మిశ్రా అన్నారు.

దిగుమతుల లిస్ట్‌‌‌‌ సిద్ధమవుతోంది..
ప్రొడక్టులు ఎక్కడ తయారయ్యాయో తెలుసుకోవడానికి కన్జూమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇండియాలో తయారైన వాటిపై ఆసక్తి పెరుగుతోందని డిక్సన్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌ సునీల్‌‌‌‌వాచాని అన్నారు. దేశంలో 30 శాతం ఏసీలు దిగుమతి చేసుకున్నవేనని, చాలా వరకు మైక్రో ఓవెన్స్‌‌‌‌ను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఎలక్ట్రానిక్స్‌ ‌‌‌ఇండస్ట్రీ బాడీ సీమా ప్రెసిడెంట్‌ కమల్‌‌‌‌నంది అన్నారు. వీటిలో ఎక్కువగా చైనాలో తయారైనవే ఉన్నాయని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ఈ పరిస్థితి మారుతుందని పేర్కొన్నారు. ఇండియాలోనే తమ ప్రొడక్ట్ లను తయారు చేయడానికి చాలా బ్రాండ్లు రెడీ అవుతున్నాయని వీడియోటెక్స్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ డైరక్టర్‌‌‌‌‌‌‌‌ అర్జున్‌ బజాజ్‌ అన్నారు. కొత్తగా టీవీ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన కంపెనీలు కూడా కాంట్రాక్ట్‌ ‌‌‌మాన్యుఫ్యాక్చరర్లతో తమ ప్రొడక్షన్‌ను స్టార్ట్‌ ‌‌‌చేయాలని చూస్తున్నాయని చెప్పారు. కాగా వన్‌ ప్లస్‌, రియల్‌‌‌‌మీ వంటి చైనీస్‌ బ్రాండ్లు తమ టీవీలను ఇండియాలోనే తయారు చేస్తున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఫినిష్డ్‌ ‌‌‌గూడ్స్‌ ‌‌‌లిస్ట్‌‌‌‌ను కేంద్రం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. తమ చైనా ప్రొడక్షన్‌ను ఇతర ఏషియన్‌ దేశాలకు షిఫ్ట్‌ చేయాలని చాలా వరకు బ్రాండ్లు భావిస్తున్నాయని ఎస్‌ఎస్‌ఐపీఎల్‌ ‌‌‌గ్రూప్‌ ‌‌‌ఎండీ రిషబ్‌ సోని అన్నారు. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ప్రొడక్ట్ ల లిస్ట్‌‌‌‌ను సీఎంఏ సిద్ధం చేస్తోంది.

For More News..

ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌ రికార్డు

లాక్‌‌డౌన్ సడలించినా షాపింగ్ చేయట్లే..

కలిసి ఆడి.. కరోనా అంటిచ్చుకున్నరు