ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం

ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం

భారత దేశాన్ని శాసిస్తూ నడపాలని ప్రధాని మోడీ నల్ల చట్టాలు తెచ్చారని అన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. అయితే.. రైతుల పోరాటానికి తలోగ్గి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. రైతులను తొక్కి చంపిన అజయ్ మిశ్రా పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా పోరాటం చేసిందన్నారు. మోడీ ఇప్పటికైన తన వైఖరి మార్చుకోవాలన్నారు.రైతులకు క్షమాపణలు కాదు.. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు కూడా ఫెయిల్యూర్ అయ్యిందన్నారు. ఇప్పటికీ రాష్ట్రం లో ధాన్యం సేకరణ చేయడం లేదని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు..ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు మధు యాష్కీ. పక్క రాష్ట్రాల్లో లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో.. రైతులు మరింత నష్ట పోతున్నారని తెలిపారు.ధర్నా చౌక్ వద్దంటే..తెలంగాణ లో పాలన బాగుంటది అనుకున్నాం..కానీ ఇంత నియంత పాలన వుంటదని అనుకొలేదన్నారు. అదే ధర్నా చౌక్ కి వచ్చి కేసీఆర్ ధర్నా చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజలు, రైతులతో పెట్టుకుంటే.. మీ కుర్చీలు కూలుతాయన్నారు.