కాంగ్రెస్‌కు షాక్.. 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన  20 మంది  ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా జ్యోతిరాదిత్య సింధియా వర్గం. దీంతో కమల్ నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే చెప్పాలి.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన  సింధియా మంగళవారం  సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. మొదట సింధియా మద్దతుదారులైన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  బెంగళూరులోని ఓ రిసార్టుకి వెళ్లారు. వీరంతా కర్ణాటక డీజీపీ కి ఓ లేఖ రాస్తూ… తామంతా తమ స్వంత పనుల కోసం బెంగుళూరు వచ్చామని, తమకు రక్షణ కల్పించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఈ సంఖ్య 20 కి చేరింది.

20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాబట్టి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలే అవకాశాలున్నాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. మిగతావారిలో నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ సభ్యులు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఉండగా.. వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.

మెజారిటీ మార్కు 115 అనుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కావున.. ఆ పార్టీకి ఇక మద్ధతు ఇచ్చే అవకాశాలు లేవు.

Latest Updates