అత్యాచార నిందితుడిపై లాయర్ల దాడి.. వీడియో

మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వయస్సుతో సంబంధం లేకుండా పసి పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల పైబడిన మహిళలపై కూడా మృగాళ్లు తెగపడుతుండడంతో ప్రజలు ఉపేక్షించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారిపై అత్యాచారం చేసిన ఓ నిందితుడిని కొంతమంది లాయర్లు కోర్టు బయటే దాడి చేశారు. మధ్య ప్రదేశ్ లోని మోవో కోర్టు ప్రాంగణంలో జరిగిందీ ఘటన.

ఇండోర్ లో కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు చిన్న పాపపై అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ప్రజలు దాడి చేసే అవకాశం ఉండటంతో.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ.. తీరా కోర్టులోకి వెళ్లాక.. అక్కడున్న లాయర్లు దాడి చేశారు. జడ్జీ ముందు హాజరుపరిచి బయటకు తీసుకొచ్చే సమయంలో… లాయర్లు నిందితుడిని అడ్డుకుని దాడి చేశారు.

Latest Updates