వివాదాన్ని రేపిన 10వ తరగతి ప్రశ్నాపత్రం.. ఇద్దరు టీచర్లు సస్పెండ్

పదవ తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం సోషల్ పరీక్షా పత్రంలో వచ్చిన ఓ ప్రశ్న పెద్ద వివాదానికి దారి తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి పరీక్షలు జరుగుతుండగా.. శనివారం విద్యార్ధులను భారతదేశ చిత్రపటంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) ను  ఆజాద్ కశ్మీర్ సంబోధిస్తూ.. ఆ ప్రాంతాన్ని గుర్తించమని ఓ ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్న శనివారం పెద్ద దుమారాన్నే రేపింది.

అభ్యంతరకరమైన ఈ ప్రశ్న గురించిన వార్త బయటికి రావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మండి పడ్డారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రశ్నపత్రాన్ని సెట్ చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇదిలావుండగా.. మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్… ఆ ప్రశ్నా పత్రాన్ని సెట్ చేసి ప్రచురణకు ఆదేశించిన ఇద్దరు వ్యక్తులను సస్పెండ్ చేసింది. బోర్డ్ చైర్ పర్సన్ సలీనా సింగ్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

Latest Updates