ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే కుమార్తె

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్తె జ్యోతి(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ బరాన్ జిల్లా తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
బర్ఖేడ గ్రామంలో  ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందని సమాచారంతో ఘటన స్థలాన్ని చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. మెడపై ఉన్న ఆనవాళ్లు, దొరికిన ఆధారాలతో బాధితురాలు అర్ధరాత్రి ఉరేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు..ఆమె ఎవరు..? ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో పోహారీ నియోజకవర్గం కాంగ్రెస్  రెబల్ ఎమ్మెల్యే  సురేష్ ధాకడ్ కుమార్తెగా నిర్ధారించినట్లు పోలీసులు చెప్పారు.   బాధితురాలు డాక్టర్ జై సింగ్ మెహతాను వివాహం చేసుకుంది. అతడు షాహాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుండగా వారికి ఒక కుమార్తె ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించిన పోలీసులు..బాధితురాలు ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభించారు.

for more news

see this – స్టార్ క్రికెటర్ కు కరోనా వైరస్

see this – సైబర్ క్రైమ్ పోలీసులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

see this – ప్లీజ్ మమ్మల్ని కరోనా వైరస్ అని పిలవొద్దు

see this – తెలంగాణలో మద్యంతో పాటు ఏఏ ఛార్జీలు పెరుగుతున్నాయంటే

Latest Updates