మధ్యప్రదేశ్​లో కొలువుదీరిన మంత్రివర్గం

భోపాల్: మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం ఏర్పడింది. ఒక మహిళ, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో సహా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు లభించింది. నరోత్తం మిశ్రా, తులసీరామ్ సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మీనా సింగ్, కమల్ పటేల్ మంగళవారం రాజ్​భవన్​లో గవర్నర్ లాల్జీ టాండన్ సమక్షంలో ప్రమాణం చేశారు. కరోనా ఎఫెక్టు, లాక్​డౌన్ నేపథ్యంలో ప్రమాణ కార్యక్రమం సాధారణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో మార్చి 23 న శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

 

Latest Updates