సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్‌నాథ్

వారం రోజులుగా హీట్ పుట్టిస్తున్న మధ్యప్రదేశ్ రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ, ఆ బల పరీక్షకు ముందే మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ తన పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసి ఆయనకు అందచేయనున్నారని సమాచారం. విశ్వాస పరీక్షకు ముందే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది.

మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని మీడియా సమక్షంలోనే ప్రకటించారు. తాను 15 నెలల్లో మధ్యప్రదేశ్‌ని ఎంతో అభివృద్ది చేశానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తమ ఎమ్మెల్యేలను బీజేపీ కర్ణాటకలో నిర్భందించిదని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.

For More News..

‘ఉద్యోగులు ఆఫీసుకు రాకపోయినా జీతాలివ్వాలి’

30 నిమిషాలపాటు ఉరితాడుకు వేలాడిన నిర్భయ దోషులు

ఉరికి ముందు నిర్భయ దోషులు ఏంచేశారంటే..

ఉగ్రవాదుల దాడిలో 29 మంది సైనికులు మృతి

నిర్భయ కేసు: దోషుల్లో అతను ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు

నిర్భయ దోషులకు ఉరి అమలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. 2 లక్షలు దాటిన కేసులు

Latest Updates