మధ్యప్రదేశ్‌ అవిశ్వాసంపై గవర్నర్ అనూహ్య నిర్ణయం

మార్చి 26 వరకు వాయిదావేసిన గవర్నర్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో బీజేపీకి బలం పెరిగింది. దాంతో బీజేపీ కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని గవర్నర్‌ను కోరింది. ఆ విషయం మీద ఈ రోజు ఏదో ఒకటి తేలుతుందని అందరూ ఎదురు చూశారు. కానీ.. దానికి భిన్నంగా మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అసెంబ్లీకి వచ్చి అనూహ్య ప్రకటన చేశారు. మొదట ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. ఒక నిమిషం మాట్లాడిన తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 26 వరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్‌కు మరో పది రోజుల సమయం కలిసొచ్చింది. గవర్నర్ తన ప్రసంగం చివర ‘హౌజ్‌ను గౌరవించండి’ అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు.

For More News..

ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఆ బండ్లన్నీ స్క్రాపే

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

మహేశ్ కాదన్న సినిమా.. పవన్ చేస్తున్నాడా?

Latest Updates